ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్  సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అనేది మనకు తెలిసిందే.. సుకుమార్ చాలా చాలా టాలెంటెడ్ డైరెక్టర్ . ఏ హీరో తో సినిమా చేసిన ఆ హీరోకి హిట్ అందించేస్తూ ఉంటాడు.  రీసెంట్ గానే పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ కని విని ఎరుగని హిట్  ఆయన ఖాతాలో వేశాడు. ఇక లైఫ్ లో అలాంటి హిట్ అందుకుంటాడో లేదో అనేటటువంటి హిట్ బన్నీ ఖాతాలో వేసుకునేలా చేశాడు. ప్రజెంట్ అల్లు అర్జున్ సినిమా అట్లీ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాలి .


కాగా సుకుమార్ పుష్ప2  సినిమా తర్వాత గ్లోబల్ హీరో రాంచరణ్ ని డైరెక్ట్ చేయడానికి అంత సిద్ధం చేసుకున్నాడు . రంగస్థలం 2 గా ఈ సినిమా తెరకెక్కబోతుంది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమా కంటే ముందే సుకుమార్ ఓ యాడ్ ని డైరెక్ట్ చేయబోతున్నారట.  ఆశ్చర్యం ఏంటంటే  అందులో యాక్ట్ చేయబోయేది  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. యస్.. అల్లు అర్జున్ నే ఈ యాడ్ లో యాక్ట్ చేయబోతున్నారట. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక.. పలు బ్రాండ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు .



రీసెంట్ గానే ఒక ఇంటర్నేషనల్  బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి అల్లు అర్జున్ కి ఆఫర్  వచ్చిందట . ఈ యాడ్ ను సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . అన్ని అనుకున్నట్లు కుదిరితే సుకుమార్  -  రామ్చరణ్ కంటే ముందే  అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసేస్తాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ ప్రసెంట్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో "పెద్ది" సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.  అందుతున్న సమాచారం ప్రకారం ఒక మూడు నెలల్లో ఈ సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంటూ తెలుస్తుంది . ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాని సెట్స్ పైకి తీసుకొస్తాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: