- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా గురించి సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి - జ్యోతికృష్ణ‌ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా చాలా కాలంగా వాయిదాపడుతూ వ‌స్తూ చివరకు విడుదలకు రెడీ అవుతోంది. దీంతో సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌కి ఉన్న స్టార్ డమ్‌కు తగ్గట్టుగా, ఈ సినిమా హక్కులన్నీ భారీ రేట్ల‌కు విక్రయించబడ్డాయి. ఆంధ్రా, నైజాం, సీడెడ్‌ ప్రాంతాల్లో థియేట్రికల్ రైట్స్  దాదాపు రు. 85 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. తెలంగాణలో పవన్ అభిమానులు ఎక్కువగా ఉండటంతో, నైజాంలో ఈ సినిమాపై భారీ డిమాండ్ ఉంది. సీడెడ్ ప్రాంతంలో కూడా డీసెంట్ రేటుకి డిస్ట్రిబ్యూటర్లు కోట్ చేశారు.


ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కలిపితే ఈ సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రు.130 కోట్ల మార్కు క్రాస్ చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఒకటి దాదాపు రు. 30 కోట్లకు డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది. ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతున్నందున, విభిన్న వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని క‌లిగిస్తోంది. హరిహర వీరమల్లు సినిమాకు భారీ సెట్స్, గ్రాఫిక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నందున దాదాపు  రు. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా నిర్మాతలు చాలా వ‌ర‌కు రికవరీ చేసుకున్నారని టాక్ ?


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: