
జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిస్టారికల్ ఎపిక్ ‘హరిహర వీరమల్లు’ పై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ రోల్‌తో ప్రేక్షకులను అలరించబోతుండటంతో అభిమానులలో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఈ సినిమా నేపథ్యం 17వ శతాబ్దంలో సాగుతుందని, ముఘల్ రాజ్యం నేపథ్యంలో సాగే ఓ మహా యోధుడి కథ ఆధారంగా రూపొందిందని సమాచారం. దర్శకుడు క్రిష్ మరియు సహ దర్శకుడు జ్యోతి కృష్ణ కలిసి విజువల్ గ్రాండియర్‌గా మలచడమే కాకుండా పవన్ పాత్రను శక్తివంతంగా డిజైన్ చేశారని ట్రైలర్ ఆధారంగా అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు పవన్ మాస్ ర్యాంపేజ్ ఎలా ఉందో చెపుతూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.
సినిమా రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ ఏర్పడిన నేపధ్యంలో, ఇతర సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకోవడం విశేషం. అంటే ఈ వారం ‘హరిహర వీరమల్లు’కి బాక్సాఫీస్ వద్ద సింగిల్ హ్యాండెడ్ డామినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఏపీ, తెలంగాణ దాదాపు 90 శాతం థియేటర్లు ఈ సినిమాకు కేటాయించారు. అటు కర్నాకటతో పాటు రాజధాని బెంగళూరులోనూ భారీగా రిలీజ్ వుతోంది. మల్టీప్లెక్సులు, మాస్ సెంటర్లలో ప్రత్యేకంగా షోలు పెడుతూ భారీ ఓపెనింగ్స్‌ను క్యాచ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, విలన్‌గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించగా, భారీ విజువల్స్, సెట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు