
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో, దీని ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా అంచనాలకు మించి జరిగింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 126 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని సినీ వర్గాల సమాచారం. సినిమా హిట్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 127 కోట్ల షేర్ వసూలు చేయాలి. అంటే గ్రాస్ కలెక్షన్ల ప్రకారం చూస్తే రూ. 260 కోట్ల వరకు సాధించాలని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు ఇంత భారీ బిజినెస్ జరగడం మామూలు విషయం కాదు.
ఏరియా వైజ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు (కోట్లలో):
నైజాం: రూ. 37 కోట్లు
సీడెడ్: రూ. 16.50 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 12 కోట్లు
ఈస్ట్ : రూ. 9.50 కోట్లు
వెస్ట్ : రూ. 7 కోట్లు
గుంటూరు: రూ. 9.50 కోట్లు
కృష్ణ: రూ. 7.60 కోట్లు
నెల్లూరు: రూ. 4.40 కోట్లు
------------------------------------------------------------------
ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ మొత్తం: రూ. 103.50 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 12.50 కోట్లు
ఓవర్సీస్: రూ. 10 కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా: రూ. 126 కోట్లు
బ్రేక్ ఈవెన్ టార్గెట్
'హరిహర వీరమల్లు' సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 127.50 కోట్ల షేర్‌ను రాబట్టాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ, ఆయనకున్న భారీ ఫ్యాన్ బేస్, చిత్రానికి లభించిన టికెట్ ధరల పెంపు అనుమతులు ఈ టార్గెట్‌ను చేరుకోవడానికి దోహదపడతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సినిమాకు టికెట్ ధరల పెంపునకు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చాయి. జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించబడనున్నాయి. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ. 600 (జీఎస్టీ అదనం)గా నిర్ణయించారు. ఇది మొదటి రోజు వసూళ్లకు గణనీయంగా తోడ్పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో జూలై 24 నుండి ఆగస్టు 2 వరకు టికెట్ ధరలు పెరిగిన ధరలకే విక్రయించబడతాయి. సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ టికెట్లకు రూ. 100, అప్పర్ క్లాస్ టికెట్లకు రూ. 150 పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో రూ. 200 వరకు పెంచుకునే అవకాశం ఉంది.