పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తన సినిమా విడుదల అవుతున్న ప్రమోషన్ల విషయంలో పెద్దగా హడావిడి చేయడు. కొన్ని సందర్భాలలో ఆయన సినిమా కోసం ఆయన ప్రమోషన్లు చేసుకొని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ తన సినిమా సక్సెస్ అయిన కూడా దానిని పెద్ద వేడుకల అస్సలు జరుపుకోడు. సినిమా విడుదల అయ్యాక ఆయన పెద్దగా మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా లేవు. తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ రేపు అనగా జూలై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ వరుస పెట్టి ఈవెంట్లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వరుస పెట్టి ఇంటర్వ్యూలను కూడా ఇస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ... నేను నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కానీ నేను కేవలం భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ ఈవెంట్ కు మాత్రమే వెళ్లాను. అందుకు ప్రధాన కారణం ... భీమ్లా నాయక్ మూవీ కి టికెట్ ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయి.

అలాంటి సమయంలో కూడా ఆ సినిమా భారీ కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది. దానితో నేను అది అసలు సిసలైన సక్సెస్ అనే ఉద్దేశంతో ఆ సినిమా సక్సెస్ ఈవెంట్ కు అటెండ్ అయ్యాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: