
ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమూవీ విడుదల సందర్భంగా ఒక కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ‘హాఫ్ డే’ సెలవు ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలు రెడ్డి అనే వ్యక్తి లండన్ లో ఒక ఈకామర్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఆ కంపెనీలో పని చేసే 27 మంది అంతా తెలుగు వారే అని తెలుస్తోంది. దీనికితోడు ఆ కంపెనీ నిర్వహించే బాలు రెడ్డి మెగా అభిమాని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని.
సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటూ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కొనసాగుతున్న బాలు రెడ్డి ‘హరి హర వీరమల్లు’ విడుదల సందర్భంగా తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఆసినిమా టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా ఆసినిమా చూసి ఎంజాయ్ చేసే విధంగా తన సంస్థ ఉద్యోగులకు ఒక పూట సెలవు కూడ ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియ చేయడంతో ఆవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు ఎక్కువగా ఉన్న సందర్భంలో అతడి సినిమాలు విడుదల అయినప్పుడు గతంలో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు సగంరోజు సెలవు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే మన తెలుగు టాప్ హీరోలకు సంబంధించి గతంలో భారీ సినిమాలు విడుదలైన సందర్భాలలో ఇలా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన సందర్భాలు లేవు. అలాంటి అరుదైన రికార్డు కూడ పవన్ కళ్యాణ్ క్రెడిట్ లోకి వెళ్ళి పోయింది. ఇది ఇలా ఉండగా ఈమూవీలోని గ్రాఫిక్స్ చాల తక్కువ క్వాలిటీతో కనిపించడంతో పాటు ఈమూవీలోని ఎమోషన్స్ ఈసినిమను చూసిన ప్రేక్షకుల గుండె ను టచ్ అయ్యేలా సీన్స్ లేకపోవడంతో ఈమూవీ అనుకున్న స్థాయిలో విజయవంతంకాలేదు అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి..