పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా... ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి కొన్ని కారణాల వల్ల ఈయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన షూటింగ్ను పూర్తి చేశాడు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా... ఏ ఎం రత్నం ఈ మూవీ ని నిర్మించాడు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల  అయ్యి చాలా కాలం కావడం, అలాగే పవన్ కళ్యాణ్ నటించిన స్టేట్ మూవీ కావడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ ఈ మూవీ జూలై 24 వ తేదీన పెద్ద ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు భారీ కలెక్షన్లు వచ్చిన ఈ మూవీ కి మొదటి రోజు కాస్త నెగటివ్ టాక్ కూడా వచ్చింది. దానితో ఈ మూవీ కి రెండవ రోజు కలెక్షన్లు చాలా వరకు తగ్గాయి. ఈ మూవీ ని జూలై 24 వ తేదీన తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. హిందీ భాషలో మాత్రం ఐ మూవీ ని విడుదల చేయలేదు. ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ ని హిందీ భాషలో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఒకటవ తేదీన ఈ మూవీ హిందీ విడుదల ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ కి హిందీ లో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: