
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మళ్లీ మాస్ ప్రేక్షకుల మన్ననలు పొందే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈసారి విజయ్ ఓ మల్టీ ప్యాక్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్‌డమ్ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. సినిమాపై మొదటి పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు విడుదలైన ప్రతి అప్డేట్ మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. విజయ్ నుంచి గతంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయింది. అందులో విజయ్ నటన, స్క్రిప్ట్, ఎమోషన్స్‌పై విమర్శలు వచ్చాయి. అంతకు ముందు ఖుషి బిలో యావరేజ్.. లైగర్ బిగ్ డిజాస్టర్. దీంతో ఇప్పుడు విజయ్ ‘కింగ్డమ్’ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా విజయ్ కెరీర్‌కు మళ్లీ బ్రేక్ ఇస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక సినిమా బిజినెస్ పరంగా చూస్తే ‘కింగ్డమ్’కి ఇప్పటికే వల్డ్ వైడ్ గా 50 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 100 కోట్లకిపైగా గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. ఈ స్థాయిలో ఓ మిడ్-రేంజ్ హీరో సినిమా బిజినెస్ చెయ్యడం విశేషమే. గౌతమ్ తిన్ననూరి కథపై ఉన్న నమ్మకం, విజయ్ క్రేజ్, మ్యూజిక్, టీజర్, ట్రైలర్‌లతో పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం ‘కింగ్డమ్’కి ఓపెనింగ్స్ బాగానే ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. నైజాం, సీడెడ్, ఆంధ్రాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోష్‌లో ఉన్నాయి. అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా విజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గౌతమ్ తిన్ననూరి గత చిత్రం 'జెర్సీ' సక్సెస్‌తో అక్కడ కింగ్‌డమ్ పై అంచనాలు ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు