టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ప్లాప్ అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. హరిహర వీరమల్లు సినిమాకు కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారనే ఆరోపణలు ఉన్నా సెకండాఫ్ బాగుంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేదని కచ్చితంగా చెప్పవచ్చు. అదే సమయంలో అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేసిన మహావతార నరసింహ సినిమా హిట్ గా నిలవడం గమనార్హం.
'
అయితే వైసీపీ చేస్తున్న నెగిటివ్ ప్రచారమే మైనస్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ  హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచి  ఉంటే  మాత్రం పవన్ కు ఆ క్రెడిట్ దక్కేదని చెప్పవచ్చు. అయితే వైసీపీసినిమా గురించి నెగిటివ్ పబ్లిసిటీకి దూరంగా ఉండి  ఉంటే  బాగుండేదని చెప్పవచ్చు.

అనవసర విమర్శల వల్ల వైసీపీకి కూడా దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో  నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.  పుష్ప2 సినిమాకు విపరీతమైన నెగిటివ్ పబ్లిసిటీ చేసినా ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించింది.  సినిమా అద్భుతంగా ఉంటే  మాత్రం ఆ సినిమాలు కలెక్షన్ల విషయంలో మ్యాజిక్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది.

సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోతే మాత్రం కలెక్షన్ల విషయంలో నిరాశ పరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నాయి.  అయితే నెగిటివ్ ప్రచారాలు ఇండస్ట్రీకి సైతం మంచివి కావు.  ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో అయినా మారితే బాగుంటుందని చెప్పవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: