‘కాంతార’ సినిమాతో కన్నడలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మాస్ యాక్టింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు మరో పవర్‌ఫుల్ కథ కోసం సిద్ధమవుతున్నాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన రిషబ్‌కి ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ తన శైలికి తగ్గట్టు, కంటెంట్‌కి విలువ ఇచ్చే కథలకే ఓకే చెప్పే రిషబ్ … ఈసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఓ భారీ సినిమా చేయబోతున్నాడు! ఈ సినిమాకి ‘అశ్విన్ గంగరాజు’ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అశ్విన్ ఓటిటీలో వచ్చిన "అక్షర" వంటి డిఫరెంట్ కథలతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్. ఇప్పుడు గత మూడేళ్లుగా ఓ భారీ స్క్రిప్ట్ పై పనిచేస్తూ, రిషబ్ శెట్టిని లాక్ చేసి... సితార సంస్థతో ఈ ప్రాజెక్టును సెటప్ చేశాడు. ఇప్పటికే రిషబ్‌కు రూ.5 కోట్ల వరకు అడ్వాన్స్ ఇచ్చి, ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.


ప్రీ-లుక్ రిలీజ్ కావడంతో హైప్ స్టార్ట్ అయ్యింది! .. ఇది ఓ యోధుడి కథ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ… పూర్తి జోనర్ ఏంటనేది రివీల్ చేయలేదు. కానీ ఫిలింనగర్ వర్గాల కథనం ప్రకారం… ఇది స్వాతంత్ర్యం రాకముందు జరిగిన ఘట్టాల ఆధారంగా రాస్తున్న కథ. బ్రిటీష్ వారిపై తొలిసారి తిరగబడ్డ యోధుల గ్రూప్ కథ ఇది. ఆ గ్రూప్‌కి నాయకుడిగా రిషబ్ శెట్టి లీడ్ చేస్తాడు. ఆ పోరాటం ఎలా జరిగిందో, ఆ తర్వత స్వాతంత్ర ఉద్యమం ఎలా ప్రారంభమైందో అన్న పాయింట్ చుట్టూ ఈ సినిమా తిరుగనుంది. ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు – దేశభక్తి, త్యాగం, గౌరవం కలబోసిన గూస్‌బంప్ రైడ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. రిసెర్చ్ బేస్‌డ్ పీరియడ్ డ్రామాగా, పాఠ్యపుస్తకం ఆధారంగా రూపొందించిన కథను కొంత ఫిక్షన్ తో మేళవించి మరింత ఇంటెన్స్‌గా మలుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కథలోని ప్రతి సీన్, హీమేనిటీస్, డైలాగ్స్ - హృదయాన్ని తాకేలా రూపొందించబడినవి.



150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకోనుంది. ‘కాంతార 2’ పూర్తయ్యాక వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టే అవకాశం ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే దీనికి సంబంధించి పాన్ ఇండియా స్థాయిలో ప్లానింగ్ మొదలుపెట్టింది. ఇక కథలో రిషబ్ పాత్ర ఎలా ఉంటుందో, ఆ బృందం ఎవరు? వాళ్ల కథ ఎందుకు చరిత్రలో మిగిలిపోలేదు? అనే విషయంలోనూ ఈ సినిమా ఓ కొత్త దిశ చూపిస్తుందని అంచనాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈసారి రిషబ్ కన్నడ మట్టి నుంచే కాదు… భారతదేశ చరిత్రనే కదిలించబోతున్నాడా .. చూద్దాం … ఇది మాత్రం కచ్చితంగా "రియల్ రెసిస్టెన్స్"ను "రీల్"లో చూపించే అవకాశం ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: