- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకు పోతోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ట్ చేయ‌గా.. కంప్లీట్ యాక్ష‌న్ డ్రామాగా కింగ్‌డ‌మ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌త నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక కింగ్ డ‌మ్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు అటు ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రిస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్సీస్ లో నార్త్ అమెరికా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏకంగా 1.4 మిలియ‌న్ డాల‌ర్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.


ఇక ఆదివారం వీకెండ్ ఉండటంతో ఈ కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా చెపుతోంది. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మ‌రో యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ సంగీతం అందించగా ఈ కింగ్ డ‌మ్ సినిమాను నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇక వ‌రుస ప్లాపు ల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర కొండ కు కింగ్ డ‌మ్ సినిమా తో సూప‌ర్ హిట్ ప‌డ‌డం తో విజ‌య్ ఫ్యాన్స్ ఆనందం మామూలు గా లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: