
టాలీవుడ్ నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘ భగవంత్ కేసరి ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి మంచి సందేశం తో పాటు పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. పైగా విజయ్ - లోకేష్ కనకగరాజ్ లియో తో పాటు అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా లకు పోటీగా వచ్చి కూడా భగవంత్ కేసరి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
తాజాగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ తెలుగు సినిమా అవార్డును అందుకుంది. అయితే, ఈ సినిమాకు ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డు రావడంతో భగవంత్ కేసరి సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ సినిమాలో మంచి మెసేజ్ ఉండటంతో అందరికి నచ్చడంతో పాటు అటు జాతీయ అవార్డు గెలుచుకుందని నందమూరి బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి సైతం ఈ సినిమా సీక్వెల్ పై ఓపెన్ అయ్యారు. భగవంత్ కేసరి సినిమాకు సీక్వెల్ చేయాలని తనకు కూడా ఉందని.. సరైన టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా భగవంత్ కేసరి 2 చేస్తానని తెలిపారు. ఇక ఈ సినిమా లో హీరో ఖచ్చితంగా బాలయ్య అవుతాడు అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు