ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది అస్సలు తెలియడం లేదు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.  నిన్న కాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోయిన్ అప్పుడే ఐటెం సాంగ్ చేయడం ఏంటి..?? అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.  సాధారణంగా ఇండస్ట్రీ లోకి వచ్చే హీరోయిన్స్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతూ ఉంటారు . ఏ హీరోతో నటిస్తే తమ కెరియర్ ముందుకు వెళుతుంది..? ఎలాంటి ఆఫర్స్ మన ఖాతాలో పడతాయి..? ఎలాంటి రూమర్స్ మనపై వినిపిస్తాయి..? అంటూ పక్క ప్లాన్ తో ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటారు .


కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ అసలు ముందు వెనుక ఆలోచించుకోకుండా తమ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ సినిమా ఇండస్ట్రీలో అనే ధ్యాస లేకుండా మైండ్ కి ఏ డెసిషన్ నచ్చితే ఆ డెసిషన్ తీసుకుంటున్నారు . తాజాగా శ్రీ లీల పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చేసి ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే . అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా తెరకెక్కిన పుష్ప2 సినిమాలో దెబ్బలు పడతాయి రాజా అంటూ ఐటమ్ సాంగ్ లో చిందులు వేసింది శ్రీలీల.



అసలు శ్రీలీలా ఒక ఐటమ్ సాంగ్ చేస్తుంది అని ..జనాలు ఊహించలేకపోయారు . ఇంత త్వరగా చేస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . ఇదే మూమెంట్లో మరొక హీరోయిన్ కూడా శ్రీలీల తీసుకున్న విధంగానే సెన్సేషనల్  డేసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది . ఆమె మరెవరో కాదు "మమిత బైజు" . నిన్న కాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ హీరోయిన్ ఇంకా స్టార్ గా మారలేదు . ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ వస్తుంది. ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చేసిందట . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది.  బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో మమిత బైజు స్పెషల్ ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చేసిందట . మమిత బైజు ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా ఓకే చేయలేదు. స్టార్టింగ్ నే  ఐటమ్ సాంగ్ చేస్తే కెరియర్ సంకనాకి పోతుంది అంటూ హెచ్చరిస్తున్నారు సినీ విశ్లేషకులు . మరి మమిత ఈ సలహాలను పాటిస్తుందో లేదో..? తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: