ప్రభాస్ - అనుష్క.. ఈ ఇద్దరికి పెళ్లి కాలేదు . ఇద్దరు ఇండస్ట్రీలో బిగ్ బడా స్టార్స్. ఈ ఇద్దరు  పెళ్లి చేసుకుంటే చూడాలి అనేది అభిమానుల కోరిక . వీళ్ళు చేసుకుంటారో చేసుకోరో పక్కన పెడితే.. వీళ్ళు పెళ్లి చేసుకుంటే ..పిల్లలు పుడితే ఎలా ఉంటుంది అన్న విషయాలను సోషల్ మీడియా వేదికగా ఏఐ టెక్నాలజీ యూస్ చేసి రకరకాల ఫోటోలను వైరల్ చేస్తూ ఉంటారు అభిమానులు . అంతటి పిచ్చి అభిమానం ప్రభాస్ - అనుష్కలు అంటే జనాలకి. మరీ ముఖ్యంగా ప్రభాస్ - అనుష్కలు ప్రేమించుకున్నారు ..ప్రేమించుకుంటున్నారు ..పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి .


పలు సందర్భాలలో వీళ్ళు ఓపెన్ గానే చెప్పారు .."మా మధ్య ప్రేమ లేదు అని.. మేము ఫ్రెండ్స్ మాత్రమే " అంటూ ఎన్నో ఇంటర్వ్యూలలో బయటపెట్టారు . కానీ వాళ్ళిద్దరి మధ్య చనువు చూసి మాత్రం అందరూ అది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమే అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. కాగా రీసెంట్గా ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. బాహుబలి సినిమా షూటింగ్ సెట్స్ లో ది ఈ వీడియో అంటూ క్లియర్ గా తెలిసిపోతుంది. రెబల్ హీరో ప్రభాస్ - దగ్గుబాటి హీరో రానా అల్లరి ఈ వీడియోలో మామూలుగా ఉండదు.

 

చాలా అల్లరి అల్లరిగా ఎంజాయ్ చేస్తున్న రానా - ప్రభాస్.. బాహుబలి సెట్స్ లో అనుష్కతో మాట్లాడుతున్న ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. అయితే రానా - ప్రభాస్ ఇద్దరు అటుపక్కనే ఉన్న అనుష్క మాత్రం ప్రభాస్ దగ్గరికి వెళ్లి క్లోజ్ గా మాట్లాడుతుంది. అది ఈ వీడియోలో చూడొచ్చు . దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ నిజమే అని బాహుబలి సినిమాతో అది ప్రూవ్ అయింది అని .. సినిమా సెట్స్ పై ఎంత బాగా కెమిస్ట్రీ పండిందో సినిమా షూటింగ్ టైం లోను వీళ్ళు అంతే చనువుగా ఉన్నారు అంటూ ఈ వీడియో ఆధారంగా మాట్లాడుకుంటున్నారు . ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . మరి అనుష్క - ప్రభాస్గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో వేచి చూడాలి...!??



మరింత సమాచారం తెలుసుకోండి: