
అయితే ఇప్పుడు ఈమూవీని డిసెంబర్ లో కాకుండా వచ్చే సంవత్సరం జనవరి 9న విడుదల చేయమని ఈమూవీ బయ్యర్ల నుండి ఈమూవీ నిర్మాతలకు విపరీతంగా ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాలకు కలక్షన్స్ పరంగా విపరీతంగా రికార్డులు క్రియేట్ చేసి అవకాశం ఎక్కువగా ఉండటంతో ఈమూవీని సంక్రాంతి ముందు విడుదల చేస్తే ఈసినిమాకు అన్నివిధాల కలిసి వస్తుందని ఈమూవీ బయ్యర్ల ఆలోచన అన్న వార్తలు వస్తున్నాయి.
అయితే రాబోతున్న సంక్రాంతికి అనేక భారీ సినిమాలు క్యూ కడుతున్న పరిస్థితులలో ‘రాజాసాబ్’ ఎంతవరకు ధైర్యం చేసి పోటీలో నిలబడతాడు అన్నసందేహాలు కూడ ఉన్నాయి. తమిళ హీరో విజయ్ ‘జన నాయకుడు’ రవితేజ కిషోర్ తిరుమల మూవీ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ తో పాటు ‘రాజాసాబ్’ విడుదలచేయడం ఎంతవరకు శ్రేయస్కరం అన్నకామెంట్స్ కూడ వస్తున్నాయి.
ఈసినిమాలతో పాటు అనీల్ రావిపూడి చిరంజీవిల కాంబినేషన్ మూవీ కూడ సంక్రాంతికి రావడం ఖాయం అని అంటున్నారు. దీనితో ఇన్ని సినిమాల విడుదలకు సరిపోయే ధియేటర్లు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈసంక్రాంతి రేస్ నుండి ఎన్ని సినిమాలు తప్పుకుంటాయి మారెన్ని సినిమాలు ధైర్యంగా పోటీకి నిలబడతాయి అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. దర్శకుడు మారుతి చాల ఆశలు పెట్టుకుని ఈమూవీని తీస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘హారర్ ఫీవర్’ నడుస్తున్న నేపధ్యంలో ‘రాజాసాబ్’ కూడ ‘స్త్రీ 2’ ‘భూల్ భులాయ్యా 3’ ‘ముంజ్య’ ‘షైతాన్’ సినిమాల స్థాయిలో ‘రాజాసాబ్’ బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందని అంచనాలతో డిసెంబర్ 5న విడుదల చేయమని ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్..