ఏంటి సంగీత కూడా విడాకులు తీసుకోపోతుందా..ఇది నిజమేనా.. ఒక హీరోయిన్ విడాకుల వార్తలు మరవక ముందే మరో హీరోయిన్ విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు రావడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటున్నారు ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజెన్లు. మరి ఇంతకీ సంగీత విడాకులు తీసుకోబోతున్నట్టు ఎక్కడైనా ప్రకటించిందా..లేదా ఏదైనా క్లూ ఇచ్చిందా.. ఎందుకు ఈమె విడాకుల వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.. సీనియర్ నటి సంగీత ఖడ్గం సినిమాలోని ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో వైరల్ అయింది.ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోల సరసన మెరిసింది. అలా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ అయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లయి పాప పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

అలా హీరో హీరోయిన్లకి తల్లి,అత్త పాత్రల్లో చేస్తూ దూసుకుపోయింది.ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో సంగీత నటించిన మసూద, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు ఈ హీరోయిన్ కి మంచి గుర్తింపుని ఇచ్చాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. దానికి కారణం తన సోషల్ మీడియా ఐడిని మార్చడమే. అయితే చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు అయ్యాక తమ భర్త ఇంటి పేరునో లేక తమ భర్త పేరునో తమ సోషల్ మీడియా ఖాతాలో తమ పేరు చివరన పెట్టుకుంటూ ఉంటారు. అయితే సంగీత కూడా తన సోషల్ మీడియా ఖాతాకి సంగీత క్రిష్ అని పెట్టుకుంది.

కానీ తాజాగా సంగీత క్రిష్ అని ఉన్న ఐడిని మార్చేసి Sangeetha.act అని పెట్టుకుంది. దీంతో ఇన్స్టాఐడి మార్పుతో సంగీత క్రిష్ మధ్య విభేదాలు వచ్చాయి. సంగీత భర్తతో విడాకులు తీసుకోబోతుంది అనే ఊహాగానాలు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.మరీ ముఖ్యంగా చాలా రోజుల నుండి సంగీత తన భర్తకు దూరంగా ఉందని,జనవరి తర్వాత సంగీత తన భర్తతో కలిసి ఉండడం లేదని, చివరిగా జనవరిలో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఆ తర్వాత భర్తతో కలిసి ఉన్న ఫోటోలు ఒక్కటి కూడా లేవు అంటూ నెటిజన్స్ తేల్చేస్తున్నారు.అయితే భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయకపోయినప్పటికీ భర్త పేరు తన సోషల్ మీడియా ఖాతా నుండి తీసేయడంతో ఈ ఊహగానాలు ఊపందుకున్నాయి.ఇక విడాకుల వార్తలపై సంగీత స్వయంగా క్లారిటీ ఇస్తే గాని అసలు విషయం బయటపడదు

మరింత సమాచారం తెలుసుకోండి: