బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం మదర్స్ మోడ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌కు గ్యాప్ ఇచ్చి తన బిడ్డతో క్వాలిటీ టైమ్ గడుపుతోంది. కానీ ఆమె స్క్రీన్‌పై మాత్రం హవా కొనసాగుతోంది. ఎందుకంటే ఆమె నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ‘వార్-2’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి కియారాకు సంబంధించిన బికినీ సీన్ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది! సోషల్ మీడియాలో సునామీ – బికినీ బ్యూటీకి ఫిదా ఆడియన్స్! :కియారా బికినీలో కనిపించిన ఓ ప్రమోషనల్ క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
 

ఇప్పటివరకు బాలీవుడ్‌ లో ఎవరూ చూపించని రేంజ్‌లో గ్లామర్ విండో ఓపెన్ చేసి.. ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసింది. "ఇంత వరకు బాలీవుడ్‌లో ఇంత అద్భుతమైన బికినీ షాట్ చూసిన దాఖలాలే లేవు", అంటూ నెటిజన్లు ఫైర్ కామెంట్లు చేస్తున్నారు. CGI రూమర్స్.. నెగెటివిటీకి మేకర్స్ కౌంటర్! : అయితే ఇదే సమయంలో.. కొంతమంది నెటిజన్లు ఈ బికినీ షాట్ నిజమైనది కాదు.. CGI వర్క్ అంటూ ఆరోపణలు చేశారు. ఎడిటింగ్‌లో ఈ షాట్‌ క్రియేట్ చేశారని ప్రచారం మొదలైంది. దీంతో సోషల్ మీడియాలో కియారాపై నెగెటివ్ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. దీంతో ఇక సైలెంట్‌గా ఉండకుండా వార్-2 టీమ్ రంగంలోకి దిగింది. BTS వీడియోతో ఊహాగానాలకు చెక్!:వారు నేరుగా ఓ BTS (Behind The Scenes) వీడియోను రిలీజ్ చేశారు.

 

ఇక అందులో కియారా బికినీ సీన్ కోసం ఎలా ప్రిపేర్ అయిందో చూపించారు. ఆమె వర్కౌట్స్, మేకప్, ఆన్-సెట్ షాట్స్ అన్నీ చూపిస్తూ.. ఈ సీన్ ఏమీ గ్రాఫిక్ వర్క్ కాదని, పూర్తిగా ఒరిజినల్ షూట్ చేయబడ్డదని క్లారిటీ ఇచ్చేశారు. కియారా కష్టం, డెడికేషన్ అక్కడే స్పష్టమవుతోంది. వార్-2: మాస్ మల్టీస్టారర్ పాన్ ఇండియా రోర్! .. ఇక సినిమాపై ఓపెనింగ్ నుంచి భారీ అంచనాలున్నాయి. యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఇది కీలక మూవీ. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సూపర్ విజువల్స్‌తో రూపొందించిన ఈ మూవీ ఆగస్టు 14న భారీగా రిలీజ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: