
వాళ్లకు ఏమైనా సందేహాలు వస్తే ఫోన్ చేసి అడుగుతున్నాయని బన్నీవాస్ వెల్లడించారు. టాలీవుడ్ సినీ కార్మికుల స్కిల్ గురించి కూడా ఆయన మాట్లాడారు. టాలీవుడ్ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని కానీ ఎన్ని సినిమాలు ఆ స్థాయికి వెళ్తున్నాయో కూడా గుర్తించాలని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి పది చిత్రాలను దృష్టిలో ఉంచుకుని లెక్కలేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం ధరలు పెరిగాయని ఎంత చిన్న సినిమా అయినా ఆ సినిమా బడ్జెట్ 12 కోట్ల రూపాయలు అవుతోందని ఆయన పేర్కొన్నారు. అలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే తప్ప నిర్మాతలకు లాభాలు రావట్లేదని అలాంటి తీయగలరని ప్రశ్నించారు. తెలుగు సినిమా టెక్నీషియన్ల స్కిల్ అప్ డేట్ చేయాలనీ అలా బడ్జెట్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆయన అభిప్రాయం వ్యకం చేశారు.
మనవాళ్ళు ఆ స్థాయిని అందుకునే వరకు బయటి వారి రాక తప్పదని వెల్లడించారు. మౌళి, శివాని నాగారం ప్రధాన పాత్రల్లో లిటిల్ హార్ట్స్ తెరకెక్కగా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో, ఓటీటీలలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో బన్నీ వాస్ నిర్మాతగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.