
అయితే సమంత రాజ్ నిడుమూరుతో ప్రేమాయణం కొనసాగిస్తుంది అని త్వరలోనే ఆయనను పెళ్లి చేసుకోబోతుంది అనేది లేటెస్ట్ న్యూస్ . దానికి తగ్గట్టే వీళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్న ఫొటోస్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి వీళ్ళు మాత్రం ఎక్కడా కూడా అఫీషియల్ గా బయట పెట్టడం లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నిశ్చితార్థం అయిపోయింది అన్న వార్త వైరల్ గా మారింది.
రాజ్ నిడుమూరు బర్త డే ఆగస్టు 4వ తేదీ ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యుల మధ్య వీళ్లు నిశ్చితార్థం చేసుకున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై సమంత కాని రాజ్ నిడుమూరు కానీ ఏ విధంగా స్పందించలేదు. గతంలో అక్టోబర్ ఆరవ తేదీ సమంత పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది . ఇప్పుడు ఆగస్టు 4వ తేది వాళ్ళ నిశ్చితార్ధం అయిపోయింది అన్నట్లు ప్రచారం జరుగుతుంది . ఇవన్నీ చూసుకుంటే నిజంగానే సమంత నిశ్చితార్ధం జరిగిందా..? ఆరవ తేదీ అక్టోబర్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా ..? అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. దీనిపై సమంత కానీ రాజ్ నిడుమూరు కానీ ఏ విధంగా స్పందించకపోవడం గమనార్హం. నాగచైతన్య ని సమంత అక్టోబర్ 6వ తేదీ పెళ్లి చేసుకుంది . దానికి రివేంజ్ వర్షన్ ని ఆమె తన రెండో పెళ్లి కూడా అక్టోబర్ ఆరవ తేదీ చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . దీని పై నెగిటివ్గా స్పందించకపోవడంతో అంతా నిజమే ఏమో అనుకుంటున్నారు . దీనిపై సమంత స్పందిస్తే బాగుంటుంది అనేది అభిమానుల అభిప్రాయం . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??