
మహేష్ బాబు ఆస్తుల విలువ దాదాపు 400 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. సినిమా రెమ్యునరేషన్ తో పాటు, ఆయన ఆదాయానికి పలు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. ఆయన అనేక ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు తన సొంత నిర్మాణ సంస్థ అయిన జీ. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా పలు సినిమాలను నిర్మించి, హిట్లను అందుకున్నారు.
హైదరాబాద్‌లో ఉన్న అత్యాధునిక మల్టీప్లెక్స్ అయిన ఏఎంబీ సినిమాస్‌లో ఆయనకు భాగస్వామ్యం ఉంది. ఇది ఆయన ఆదాయానికి ఒక ముఖ్యమైన వనరుగా మారింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబైలలో కూడా ఆయనకు విలాసవంతమైన నివాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఆయన ఆస్తుల విలువను పెంచుతున్నాయి.
మహేష్ బాబుకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. మహేష్ బాబు కేవలం సంపదను పోగు చేసుకోవడానికే కాకుండా, దానిని సమాజానికి తిరిగి ఇవ్వడంలో కూడా ముందున్నారు. ఆయన స్థాపించిన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా అనేక మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు (హార్ట్ సర్జరీలు) చేయిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు మహేష్ బాబు ఒక ఆపద్బాంధవుడిగా నిలిచారు. మొత్తానికి, సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా కెరీర్‌తో పాటు, వ్యాపారాలు, సమాజ సేవలతో ప్రశంసలు అందుకున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు