
చిరంజీవి ఇలా రాసుకుంటూ.. నా దృష్టికి వచ్చిన విషయం.. ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటూ కొంతమంది మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. తాను ఫెడరేషన్ సభ్యులను కలిసి 30% వరకు వేతన పెంపు డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు.. ఈ సందర్భంలో తాను నిజం చెప్పాలనుకుంటున్నాను.. నేను ఫెడరేషన్ కి చెందిన ఎవరిని కూడా కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం కాబట్టి తాను ఏకపక్షంగా ఏలాంటి నిర్ణయాలను తీసుకొని సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం లేదంటూ తెలియజేశారు.
తాను ఎవరిని కలవలేదు ఇది ఇండస్ట్రీ సమస్య అంటు తెలిపారు. వ్యక్తిగతంగా తాను ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదని ఫిలిం ఛాంబర్ దే తుది నిర్ణయం అంటూ మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తన మీద వస్తున్న ప్రకటనలను తాను ఖండిస్తున్నానంటూ చిరంజీవి తెలియజేశారు. అటు మెగా కుటుంబ సభ్యుల సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలకు కూడా ఈ సమ్మె కారణంగా ఇరకాటంలో పడే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ విషయం పైన నిర్మాత లు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు వేతనాలను పెంచలేమంటూ తెలియజేశారు.