
ముజీబ్ అని ఆదోని నుంచి వచ్చిన ఆ అభిమానిని ఎవరండీ అని అడగగా ఫ్యాన్ అని చెప్పాడని తారక్ తెలిపారు. అప్పుడే ఏంటి అని అడగగా ఏమో అని ఆ అభిమాని చెప్పాడని నేనంటే చచ్చిపోతానని ఆ ఫ్యాన్ చెప్పాడని నా వెంటే ఉంటానని ఆ అభిమాని చెప్పాడని తారక్ కామెంట్లు చేశారు. నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం పూర్వజన్మ సుకృతం అని తారక్ తెలిపారు.
గత 25 ఏళ్లలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారని ఆయన తెలిపారు. అభిమానులు ప్రేమను పెంచుతూ వెళ్లారే తప్ప తగ్గలేదని తారక్ తెలిపారు. అమ్మ, నాన్నలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తానని తారక్ అభిప్రాయపడ్డారు. నన్ను ప్రోత్సహించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అని తారక్ కామెంట్లు చేశారు. తాత సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరని తారక్ అన్నారు.
నేను ఇంట్లో సుఖంగా పడుకున్నా మీరు చేసిన ప్రార్థనలకు ఎన్నిఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినా మీ ఋణం తీర్చుకోలేనని తారక్ వెల్లడించారు. అభిమానుల కంటే శక్తి నాకు ఏదీ అవసరం లేదని తారక్ అన్నారు. ఈ జన్మకు ఇది చాలని తారక్ చెప్పుకొచ్చారు. లైఫ్ లాంగ్ ఫ్యాన్స్ ను ఆనందంగా ఉంచడానికి నా అడుగులు పడతాయని తారక్ వెల్లడించారు.