కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజిని కాంత్ తాజాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో చిన్న క్యామియో పాత్రలో కనిపించడున్నాడు.  శృతి హాసన్ , ఉపేంద్ర , సత్యరాజ్మూవీ లో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ఫుల్ స్పీడులో పూర్తి చేస్తూ వస్తున్నారు.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కీలకమైన పనిని లోకేష్ కనకరాజు తాజాగా పూర్తి చేశాడు. ఇంతకు ఆ పని ఏమిటి అనుకుంటున్నారా..? అది రి రికార్డింగ్ పని. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈయన సంగీతం అందిస్తున్నాడు అంటే ఆ మూవీ రీ రికార్డింగ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. అందులో లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఈయన అద్భుతమైన మ్యూజిక్ను అందిస్తూ ఉంటాడు.

తాజాగా అనిరుద్ ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ పనులను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా లోకేష్ కనకరాజు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో అదిరిపోయే రేంజ్ లో ఈ మూవీ పనులను పూర్తి చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో , ఏ స్థాయి కలెక్షన్లను రాబడుతుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk