
వార్ 2 సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు కావస్తోందంటూ తెలియజేశారు. కెరియర్ ప్రారంభంలో తన పక్కన ఎవరూ కూడా లేరని కేవలం తన నాన్న, అమ్మ మాత్రమే ఉన్నారంటు తెలిపారు. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ పేరు ను, తన తాత సీనియర్ ఎన్టీఆర్ పేరును కూడా గుర్తుకు చేసుకోకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోకి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది.
2001లో జూనియర్ ఎన్టీఆర్ ఆ సమయంలో మాట్లాడిన ఒక పాత వీడియోని కూడా వైరల్ గా చేస్తున్నారు. ఇండస్ట్రీలో తాను ఉండడానికి కారణం తన తాత, అలాగే బాలయ్య బాబాయ్, మా నాన్న అంటూ చేసిన వ్యాఖ్యలను బాలయ్య అభిమానులు ఇప్పుడు గుర్తుకు చేస్తూ ఆ వీడియోను వైరల్ గా చేస్తున్నారు. సక్సెస్ కాకముందు కుటుంబ పేరును వాడుకొని.. సక్సెస్ అయ్యాక సొంతంగా తానే పైకి ఎదిగి వచ్చారని చెప్పడం అందరికీ అలవాటైపోయింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను చాలా దారుణంగా బాలయ్య అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అయితే వీటికి కౌంటర్ గానే అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా బాలయ్య అభిమానులకు కౌంటర్ వేస్తున్నారు. దీంతో బాలయ్య అభిమానులు కూడా కొంతమంది ఎన్టీఆర్ సినిమాలు చూడమంటూ తెలుపుతున్నారు