తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో అల్లు శిరీష్ ఒకరు. అల్లు శిరీష్ "గౌరవం" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే అల్లు శిరీష్ ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించిన ఈయనకు పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాతో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం దక్కింది. ఈ మధ్య కాలంలో కూడా శిరీష్ నటించిన సినిమాలు ఏ సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

తాజాగా అల్లు శిరీష్మూవీ కి కమిట్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సుబ్బు అనే దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. సుబ్బు , అల్లరి నరేష్ హీరో గా రూపొందిన బచ్చలమల్లి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావించారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన బచ్చల మల్లె సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయింది. బచ్చల మళ్ళీ సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించిన సుబ్బు దర్శకత్వంలో అల్లు శిరీష్ తన నెక్స్ట్ మూవీ ని చేయబోతున్నట్లు , ఇప్పటికే సుబ్బు , అల్లు శిరీష్ కి ఓ కథను వినిపించగా , అది బాగా నచ్చడంతో సుబ్బు దర్శకత్వంలో సినిమా చేయడానికి అల్లు శిరీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే వెలబడనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: