కొన్ని సినిమాల్లో హీరోయిన్లు ఉన్నా కూడా వారి పాత్రలకు పెద్దగా గుర్తింపు ఉండదు. సినిమా మొత్తం పూర్తి అయ్యాక చూస్తే వీరు ఉన్నా ... లేకున్నా సినిమాకు పెద్దగా ఎఫెక్ట్ కాదు. సినిమాలో వీరు లేకుంటే కనీసం రెమ్యూనిరేషన్ అయిన మిగిలేది అనే ఆలోచన కూడా కొన్ని సినిమాల విషయంలో వస్తూ ఉంటుంది. అలాంటి సినిమాలు అనేకం ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో హీరోయిన్ పాత్రలపై ఇలాంటి చర్చలు చాలా మంది లో జరిగాయి. అలాంటి కొన్ని సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ లో శ్రీ లీల పాత్రకు అంతో ఇంతో ఇంపార్టెన్స్ ఉన్న మీనాక్షి చౌదరి పాత్రకు మాత్రం ఏ మాత్రం ప్రాధాన్యత ఉండదు. మీనాక్షి చౌదరి "గుంటూరు కారం" సినిమాలో మహేష్ బాబు కు మరదలి పాత్రలో నటించింది. ఆమె సినిమాలో అప్పుడు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది తప్ప ఆమె పాత్రకు అంటూ ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. ఆ సినిమా తర్వాత చాలా మంది మీనాక్షి చౌదరి ఆ సినిమాలో లేకున్నా పెద్దగా ప్రాబ్లం లేదు. అనవసరంగా ఆమెను ఆ సినిమాలో పెట్టారు అని అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో భాగ్యశ్రీ బోర్డ్స్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు ప్రాముఖ్యత లేదు. ఈమె పాత్ర సినిమాలో లేకపోయినా సినిమాకు ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు అని అనేక మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాదు అనేక సినిమాలలో కూడా అనవసరంగా హీరోయిన్ల పాత్రలో ఉన్నాయి అని ప్రేక్షకులను అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: