కేవలం కొద్దిసేపు మాత్రమే వేచి చూస్తే సరిపోతుంది. కోట్లాదిమంది అభిమానులు “ఎప్పుడు థియేటర్‌లో చూద్దాం” అంటూ నెలల తరబడి ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఆ ముమెంట్ వచ్చేస్తోంది. మనందరికీ తెలిసిందే .. రేపు ఆగస్టు 14. రేపు కేవలం ఆగస్టు 14 మాత్రమే కాదు, రెండు బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ఇంతకు ముందూ ఇండస్ట్రీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వచ్చాయి . కానీ, ఈసారి మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఇంచుమించు అందరూ చెబుతున్నట్లుగా, ఈ సినిమాలో విలన్ జూనియర్ ఎన్టీఆర్.ఒక విలన్ పాత్రలో బిగ్ బడా పాన్-ఇండియా స్టార్ నటించిన వార్ 2 సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాపై అభిమానులు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుండగా, కొందరు మాత్రం నెగిటివ్‌గా కూడా మాట్లాడుతున్నారు. “నెగిటివ్ షేడ్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని చూడగలమా? యాక్సెప్ట్ చేయగలమా? అది కూడా బాలీవుడ్ స్టార్ హీరోతో?” అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.


అయితే వార్ 2 సినిమాకి కొంత నెగిటివిటీ ఉన్నా, కూలీ మాత్రం ఫుల్ పాజిటివ్‌గా దూసుకుపోతోంది. కానీ కూలీ సినిమా రికార్డ్స్‌ను బ్రేక్ చేయడానికి, ఆ సినిమాకి ఉన్న ఇమేజ్‌ని షేక్ చేయడానికి వార్ 2 మూవీ టీం ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతుందన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు  స్టార్ హీరోలతో కలిసి అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 సినిమా కేవలం ఈ పార్ట్ లో మాత్రమే తారక్ నటించాడు అని మనకి తెలుసు. కానీ..ఇది  మొత్తం ఐదు పార్ట్స్‌గా తెరకెక్కబోతుందట. ఇది పార్ట్ 2 మాత్రమే, ఇంకా పార్ట్ 3, పార్ట్ 4,5 కూడా ఉన్నాయట. ఈ అన్నిటిలోను తారక్ నటించబోతున్నారట. ఈ సెన్సేషనల్ న్యూస్ బాలీవుడ్ మీడియాకు లీక్ అయ్యింది.



మరి ఇంకొన్ని గంటల్లో దీనికి సంబంధించిన ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ రానుందట. ఒకవేళ నిజంగా ఆ అనౌన్స్‌మెంట్ వస్తే, దెబ్బకి కూలీ సినిమా ఇప్పటివరకు తెచ్చుకున్న టాక్ రివర్స్ అవ్వొచ్చు. ప్రస్తుతం చూస్తే, వార్ 2కి కూలీతో పోలిస్తే ఎక్కువ నెగిటివిటీ ఉంది. కూలీ మాత్రం పాజిటివ్ కామెంట్స్‌తో దూసుకుపోతోంది. కానీ వార్ 2..5 భాగాలుగా రాబోతుందని తెలిసితే కచ్చితంగా ఈ వార్త ఇంటర్నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతుంది. ఆ టాక్ తో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లకు భారీ పాజిటివ్ వేవ్ వస్తుందని.. వార్ 2 జెట్ స్పీడ్‌లో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ ప్రముఖులు అంటున్నారు. చూడాలి మరి, ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో..!!?

మరింత సమాచారం తెలుసుకోండి: