
ఎన్టీఆర్ చిన్న వయసులోనే టీడీపీ కోసం స్టేజ్ ఎక్కి ప్రచారం చేశారు. కానీ రెండు పడవల మీద కాళ్లు పెట్టడం కుదరదని త్వరగానే గ్రహించారు. తన సినీ కెరీర్‌లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని భావించి, పూర్తిగా రాజకీయాల నుండి దూరమయ్యారు. అంతే కాదు, సోదరి కూకట్‌పల్లిలో పోటీ చేసినా… పబ్లిక్‌గా మద్దతు ఇవ్వలేదు. వ్యక్తిగతంగా సపోర్ట్ ఉన్నా, రాజకీయంగా దూరంగా ఉన్నారు. ఇది ఆయనకు క్లియర్ పాలసీ. ఇటీవల జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా, “నా లక్ష్యం సినిమాలే” అని స్పష్టంగా చెప్పారు. అయినా… ఆ ప్రసంగంలో ఒక్క రెండు మాటలు పట్టుకుని రాజకీయ అర్ధం చెప్పుకునే ప్రయత్నం జరిగింది. ఇక సోషల్ మీడియాలో కొంతమంది ఆయనను కొడాలి నాని, వంశీలతో లింక్ చేస్తూ పోస్టులు వేశారు. అంతేకాదు, రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్నీ రాజకీయ కోణంలోకి లాగారు. ఇవన్నీ ఆయన ఇమేజ్‌కు నష్టం చేసే పనులే.
మరోవైపు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ… టీడీపీతో గ్యాప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల కొంతమంది టీడీపీ సోషల్ మీడియా టీమ్స్ కూడా ఈగో సమస్యలతో రియాక్ట్ అవుతున్నారు. ఫలితంగా టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఎన్టీఆర్ క్లియర్‌గా రాజకీయాల నుండి దూరంగా ఉంటానని చెప్పినప్పుడు, ఆ నిర్ణయాన్ని గౌరవించడం… ఆయనకు నిజమైన గౌరవం. ఆయనను బలవంతంగా రాజకీయ రంగంలోకి లాగడం, సోషల్ మీడియాలో వివాదాలు సృష్టించడం… చివరికి పార్టీకి, ఆయనకీ నష్టం తప్ప మేలు చేయదు. సినిమాల్లోనే ఆయన శక్తి, అక్కడే ఆయన మాస్. అదే కొనసాగించనివ్వడం టీడీపీకి కూడా లాభం.