గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం గేమ్ చెంజర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. చరణ్ ప్రస్తుతం ఉప్పెన మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు , శివరాజ్ కుమార్ , దివ్యాందు ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమా తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కొన్ని సంవత్సరాల క్రితం చరణ్ , సుకుమార్ కాంబోలో రంగస్థలం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఈ కాంబోలో మూవీ రాబోతుంది అనే వార్త బయటకు రావడంతోనే ఈ కాంబో మూవీ పై ప్రేక్షకులు అంచనాలు తారా స్థాయికి చెరిగిపోయాయి.

తాజాగా చరణ్ , సుకుమార్ కాంబో మూవీ కి సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సుకుమార్ , చరణ్ తో రంగస్థలం మూవీ కి సీక్వల్ ని రూపొందించాలి అని ఆలోచనలో ఉన్నట్లు , అందుకు సంబంధించి ఒక ఆలోచనను కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు , ప్రస్తుతం దాని పైనే సుకుమార్ పని చేస్తున్నట్లు , అది అనుకున్నట్లు కనుక వచ్చినట్లయితే దానిని చరణ్ కి వినిపించనున్నట్లు , ఒక వేళ చరణ్ కూడా ఒకే చెప్పినట్లయితే వీరిద్దరి కాంబోలో రంగస్థలం మూవీ కి సీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక రంగస్థలం మూవీ కి సీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు బయటకు రావడంతో చరణ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: