సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న కొంత మంది నటీ నటులకు సూపర్ సాలిడ్ పారితోషకాలు దక్కుతూ ఉంటాయి. ఇక సినిమాలో కొంత మంది చిన్న చిన్న పాత్రలలో నటించిన సందర్భంలో స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలకు సూపర్ సాలిడ్ రెమ్యూనరేషన్లు దక్కుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరో సినిమాలో చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఆయన ఆ క్యామియో పాత్రలో నటించడానికి నాలుగు రోజులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నాలుగు రోజుల కోసం ఏకంగా ఆయన 20 కోట్ల పారితోషకం అందుకున్నట్లు , దానితో రోజుకు దాదాపు 5 కోట్ల వరకు పారితోషకం ఆ మూవీ కి ఆ స్టార్ నటుడు పుచ్చుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు ఆ సినిమా ఏది ..?  అందులో హీరో ఎవరు ..? అందులో క్యామియో పాత్రలో నటించిన నటుడు ఎవరు ..? అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ కూలీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో తన పాత్ర కోసం నాలుగు రోజులు నటించినట్లు తెలుస్తోంది. ఆ నాలుగు రోజులకు గాను ఆమీర్ ఖాన్ ఏకంగా 20 కోట్ల పారితోషకం పుచ్చుకున్నట్లు , దానితో దాదాపు రోజుకు ఐదు కోట్ల వరకు పారితోషకం అందుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఆమీర్ ఖాన్ లాంటి సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటుడు సినిమాలో భాగం అయితే ఆ మూవీ పై అదిరిపోయే రేంజ్ లో అంచనాలు ఏర్పడతాయి. అలాంటి క్రేజ్ ఉన్న నటుడుకి రోజుకు ఐదు కోట్లు ఇవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: