మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొంత కాలం క్రితం చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ ని పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసింది. ఆ తర్వాత చిరంజీవి హీరో గా రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీ ని కూడా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా మంచి కలెక్షన్లను రీ రిలీజ్ లో భాగంగా రాబట్టింది. చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్టాలిన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. కుష్బూ ఏ సినిమాలో చిరంజీవికి అక్క పాత్రలో నటించింది. చిరంజీవి సోదరుడు నాగబాబు ఈ మూవీ ని నిర్మించాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.  ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఈ మూవీ రీ రిలీజ్ తేదీ దగ్గర పడిన నేపథ్యంలో తాజాగా చిరంజీవి "స్టాలిన్" మూవీ గురించి పలు విషయాలను పంచుకున్నాడు.

తాజాగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ... స్టాలిన్ ఒక మంచి సినిమా. స్టాలిన్ సినిమా ఒక గొప్ప కథతో రూపొందింది. ఆ మూవీ రీ రిలీజ్ లో కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది అని నేను భావిస్తున్నాను. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా ఒక గొప్ప సందేశాన్ని జనాలకు అందించింది. ఈ సినిమాలో నటించిన త్రిష , కుష్బూ , ఈ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ , ఈ మూవీ కి దర్శకత్వం వహించిన ఏ ఆర్ మురుగదాస్ , ఈ సినిమాను నిర్మించిన నాగబాబుకు ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా హృదయ పూర్వక ధన్యవాదాలు అని చిరంజీవి పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: