సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నాగార్జున విలన్ పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. ఇలా ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ లోని ఆమీర్ ఖాన్ పారితోషకం గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అయింది.

ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో తన పాత్ర కోసం నాలుగు రోజులు షూటింగ్ చేసినట్లు , ఆ నాలుగు రోజుల కోసం ఆమీర్ ఖాన్ ఏకంగా 20 కోట్ల పారితోషకం పుచ్చుకున్నట్లు , అలా దాదాపు రోజుకు ఐదు కోట్ల చొప్పున కూలీ సినిమాలో నటించినందుకుగాను ఆమీర్ పారితోషకం పుచ్చుకున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది. ఇలా ఆమీర్ ఖాన్ పారితోషకం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ఆమీర్ ఖాన్ "కూలీ" సినిమాకు గాను తన పారితోషకం గురించి ఓపెన్ అయ్యాడు. తాజాగా ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ ... కూలీ సినిమాకు నేను 20 కోట్ల పారితోషకం పుచ్చుకున్నాను అని ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.

కూలీ సినిమాలో నటించేందుకు నేను ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు. రజనీ కాంత్ హీరో గా నటించిన మూవీ లో ఆయనతో కలిసి నటించడం నాకు కోట్ల రూపాయలతో సమానం. అలాంటి అవకాశం రాగానే నేను కూలీ సినిమాలో చిన్న పాత్రలో అయిన నటించడానికి ఒప్పుకున్నాను. అంతే గాని డబ్బుల కోసం ఆ సినిమా చేయలేదు. ఆ సినిమా కోసం నేను ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు. ప్రస్తుతం కూలీ సినిమా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆమీర్ ఖాన్ చెప్పకచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: