ఎస్ ప్రెజెంట్ ఇదే న్యూస్ తెలుగు ఫిలిం సర్కిల్స్‌లో అలాగే బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. మనందరికీ తెలిసిందే, బాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో బాలీవుడ్ చరిత్రలో తెలుగు హీరో తారక్ రాసే రికార్డు కచ్చితమని ఫిక్స్ అయ్యారు.


అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా హిట్ అయినప్పటికీ, తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు వచ్చినప్పటికీ, సినిమా మొత్తం స్థాయిలో పాజిటివ్ టాక్ దక్కించుకోలేకపోయింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేశారు. ఇది రాజకీయ రంగంలో కూడా పెద్ద దుమారం రేపింది. ఒక టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్‌ ని  తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ త్వరలోనే సోలోగా బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.

 

ఈ విషయంపై ఆయన అధికారికంగా ప్రకటించకపోయినా, “ఆల్మోస్ట్ కన్ఫర్మ్” అన్న న్యూస్ బయటకు వచ్చింది. అయితే వార్ 2 డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ సోలో సినిమా చేయడానికి బ్యాక్ స్టెప్ వేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నా, బాలీవుడ్‌లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌ను బాగా ప్రశంసిస్తున్నారు. ఆయన నటన, డాన్స్, స్టైల్ అన్నీ నచ్చాయని చెబుతున్నారు. కనీసం బాలీవుడ్ అభిమానుల కోసమైనా జూనియర్ ఎన్టీఆర్ సోలో ఫిలిం చేయాలి అని కొంతమంది అంటున్నారు. చూద్దాం మరి, తారక్ తన డెసిషన్ ని ఏ విధంగా మార్చుకుంటాడో..??

మరింత సమాచారం తెలుసుకోండి: