జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే నటించిన బాలీవుడ్ చిత్రం వార్ 2. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అటు నాగ వంశి, ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత అభిమానులకు మరింత నమ్మకం రెట్టింపుగా మారింది. కానీ తీర సినిమా విడుదలైన తర్వాత చూస్తే చాలామందికి నిరాశ మిగిలింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో బడాస్టార్ హీరోలు సైతం స్ట్రైట్ గా హిందీలో సినిమాలు చేయడం పెద్దగా కలిసి రాలేదనే విధంగా వినిపిస్తున్నాయి. అప్పట్లో చిరంజీవి ప్రతి బంద్, ఆజ్ కా గూండారాజ్ లాంటి చిత్రాలు మంచి హిట్ ఇవ్వగా కానీ ది జెంటిల్మెన్ సినిమాతో మళ్ళీ అటువైపుగా అడుగులు వేయలేదు.


ఇక నాగార్జున శివ సినిమా సక్సెస్ తరువాత ద్రోహి సినిమా డిజాస్టర్ కావడంతో బాలీవుడ్ వైపు అడుగు వేయలేదు. ఇక వెంకటేష్ కూడా అనారి సినిమా విజయాన్ని అందుకోగా.. ఆ తర్వాత తక్దీర్వాల సినిమాతో మళ్లీ బాలీవుడ్ వైపుగా అడుగు వేయలేదు. అయితే వీరందరిలో బాలకృష్ణ ఒక్కటే బాలీవుడ్ వైపుగా వెళ్లలేదు. ఇప్పటి జనరేషన్ విషయానికి వస్తే ప్రభాస్, రామ్ చరణ్ ఒకసారి ట్రై చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం కేవలం సౌత్ డైరెక్టర్లకే అవకాశాలను ఇస్తున్నారు. బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నా లైట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మహేష్ బాబు కూడా అంతే.

 జూనియర్ ఎన్టీఆర్ కూడా వార్ 2 సినిమాతో కొంతమేరకు ట్రైల్ వేసిన ఆకట్టుకోలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఆశల మీద భారీ బడ్జెట్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ చత్రపతి సినిమా కోసం మూడేళ్ల పాటు కష్టపడిన అక్కడ జీరో కలెక్షన్స్ ని రాబట్టారు. హీరో రామ్ కూడా ఆఫర్లు వచ్చిన వాటిని వదిలేశారు. మరి ఇక నైనా  టాలీవుడ్ సెలబ్రెటీస్ బాలీవుడ్ ని వదిలిపెడతారమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: