టాలీవుడ్ లో ప్రముఖ హీరోగా పేరు పొందిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించి చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ , నాగబాబు ప్రస్తుతం రాజకీయాలలో సినిమాలలో రాణిస్తున్నారు. ఇక చిరంజీవి పెద్ద కుమార్తె కాస్ట్యూమ్ డిజైనర్ గా ,అలాగే నిర్మాతగా కూడా కొనసాగుతోంది. సుస్మిత ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, రంగస్థలం తదితర చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది.


2023లో వచ్చిన శ్రీదేవి శోభన్ బాబు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది సుస్మిత. తన సొంత బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పైన పలు చిత్రాలను తెరకెకిస్తోంది. ప్రస్తుతం తన తండ్రి నటిస్తున్న చిత్రానికి కూడా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్గా అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఒక టీవీషోకు గెస్ట్ గా వచ్చిన సుష్మిత కొణిదల మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మెగా కుటుంబంలోని వారి బాండింగ్ గురించి తెలియజేసింది.



పవన్ కళ్యాణ్ బాబాయ్ గురించి తనకి ఉన్న బాండింగ్ గురించి చెప్పమని సుధీర్ అడగగా.. సుస్మిత మాట్లాడుతూ మేము అంతా చిన్నప్పటినుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటామని కానీ తనకు రామ్ చరణ్ కు మధ్య గొడవలు అయ్యాయి అంటే అందుకు కారణం మాత్రం పవన్ కళ్యాణ్ బాబాయి వల్లే అంటూ తెలియజేసింది. అప్పట్లో టీవీలలో పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి బాబాయ్ పవన్ కళ్యాణ్ కి బోర్ కొట్టినప్పుడల్లా కూడా రామ్ చరణ్ తన మద్య ఏదో ఒక చిచ్చు పెడుతూ ఉండేవారని.. వాటిని చూసి తన బాబాయ్ ఎంజాయ్ చేస్తూ ఉండేవారని నవ్వుతూ తెలియజేసింది సుస్మిత. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: