
ఇటీవల కూలీ సినిమాలో "మౌనిక" అనే పాత్రలో తన అందచందాలను ఆరబోస్తూ నడుముని గిరగిరా తిప్పేసింది. ఈ పాట సినిమా రిలీజ్‌కి ముందు హిట్ అయినా, రిలీజ్ అయిన తర్వాత మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. ఇక ఇప్పుడు మరో ఐటమ్ సాంగ్ బ్యూటీగా పూజా హెగ్డే పేరు మారుమ్రోగిపోతుంది. అఖిల్ అక్కినేని కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న "లెనిన్" సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుందని తెలుస్తోంది. ఇదే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కూలీలో చేసింది, అంతకుముందు పలు మూవీల్లలో చేసింది. హీరోయిన్‌గా అవకాశాలు అందుకోవాల్సిన నువ్వు ఇలా ఐటమ్ గర్ల్ అవుతున్నావేంటి? "పూజా హెగ్డే" పేరు తీసేసి "ఐటమ్ హెగ్డే" అని పెట్టుకో, అప్పుడు నీకు నువ్వు చూసుకునే ఆఫర్స్‌కి బాగుంటుంది అంటూ కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
మరి కొంతమంది మాత్రం, పూజా హెగ్డే కి సినిమాలు సరైన హిట్స్ ఇవ్వకపోవడంతో వచ్చిన అవకాశాలతోనే ఆమె తన కెరీర్‌ని ముందుకు కొనసాగిస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా, ఒకప్పుడు ఇండస్ట్రీని తన అందచందాలతో కట్టిపడేసిన పూజా హెగ్డే, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఐటమ్ సాంగ్స్ చేస్తూ అభిమానులను నిరాశపరుస్తోందని జనాలు అంటున్నారు. గతంలో పూజా హెగ్డేను "బన్నీ లక్కీ హీరోయిన్" అంటూ జనాలు పిలిచిన విషయం అందరికీ తెలిసిందే..!