యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ `వార్ 2` ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఆదిత్య చోప్రా నిర్మించారు. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఆరవ చిత్రంగా భారీ అంచ‌నాల న‌డుమ ఆగ‌స్టు 14న విడుదలైన‌ వార్ 2 మూవీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.


హృతిక్ - ఎన్టీఆర్‌ నటన, యాక్షన్ సన్నివేశాలు, కియారా అద్వానీ గ్లామ‌ర్‌ ప్రశంసించబడ్డాయి. కానీ క‌థ‌లో డెప్త్ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్ అయింది. వీఎఫ్ఎక్స్ పై కూడా ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మిక్స్డ్ టాక్ రావ‌డం, ర‌జ‌నీకాంత్ `కూలీ` పోటీగా ఉండ‌టంతో వార్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయ‌లేక‌పోతుంది. స్టార్ కాస్ట్‌, భారీ హైప్ దృష్ట్యా రికార్డు ఓపెనింగ్స్ సొంతం చేసుకున్నా.. వీకెండ్ ముగిసే స‌మ‌యానికి వీకైపోయి ఫ్లాప్ దిశ‌గా ప‌య‌న‌మ‌వుతోంది.


వార్ 2 దెబ్బేయ‌డంతో ఎన్టీఆర్ 10 ఏళ్ల స‌క్రెస్ ట్రాక్ రికార్డ్‌ బ్రేక్ అయింది. గ‌త ద‌శాబ్ద కాలంలో అప‌జ‌యం ఎర‌గ‌కుండా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌.. వార్ 2తో ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. మరి త‌న గ‌త సక్సెస్ ట్రాక్‌ని ఎన్టీఆర్ తిరిగి నెక్స్ట్ చిత్రంతో కంటిన్యూ చేస్తాడా లేదా? అన్న‌ది చూడాలి. కాగా, ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `డ్రాగ‌న్` మూవీ చేస్తున్నాడు. అదేవిధంగా ఎన్టీఆర్ లైన‌ప్ లో త్రివిక్ర‌మ్ మూవీతో పాటు `దేవ‌ర 2` కూడా ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: