తమిళ సినీ పరిశ్రమంలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఏ ఆర్ మురుగదాసు ఒకరు. ఈయన కొంత కాలం క్రితం బాలీవుడ్ స్టార్ నటుడు అయినటువంటి సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన సికిందర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా ఎ ఆర్ మురగదాస్ తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరో గా రూపొందిన మదరాసి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఏ ఆర్ మురుగదాస్  ప్రస్తుతం అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా మదరాసి సినిమా కథను మొదట ఓ హీరో కి చెప్పినట్లు , అందుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను ఈయన తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మురగదాస్ మాట్లాడుతూ ... సుమారు 7 , 8 సంవత్సరాల క్రితం నేను మదరాసి సినిమా కథను షారుక్ ఖాన్ సార్ కి చెప్పాను. ఆయనకు కూడా ఆ కథ చాలా బాగా నచ్చింది.

ఆ తర్వాత రెండు వారాలకి షారుఖ్ ఖాన్ సార్ కి నేను మెసేజ్ చేశాను. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. దానితో నేను శివ కార్తికేయన్ హీరో గా షారుక్ ఖాన్ కి చెప్పిన కథతో సినిమా చేశాను అని మురుగదాస్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా  చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఉంటే ఒకా నొక సమయంలో అద్భుతమైన విజయాలను అందుకుంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా కెరియర్ను కొనసాగించిన మురుగదాస్ కి ఈ మధ్యకాలంలో సరైన విజయం లేదు. మరి మదరాసి సినిమాతో ఆయన మంచి విజయాన్ని అందుకొని మళ్లీ హిట్ ట్రాక్ లోకి వస్తాడు అని చాలా మంది భావిస్తున్నారు. మరి మదరాసి సినిమాతో మురగదాస్ కి మంచి విజయం దక్కుతుందో ..? లేదో ..? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: