స్టార్ దర్శకుడుగా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు తెరకిక్కించిన ఏ ఆర్ మురగదాస్ అంటే భాషతో సంబంధం లేకుండా చాలామంది సినీ ఇండస్ట్రీ జనాలకు సుపరిచితం. అయితే అలాంటి ఏ.ఆర్.మురుగదాస్ పేరు వినగానే చాలామందికి సూర్య నటించిన గజినీ మూవీనే గుర్తుకొస్తుంది. ఈ సినిమాతో ఆయన పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే అలాంటి ఏ ఆర్ మురగదాస్ రీసెంట్ గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో తీసిన సికిందర్ మూవీ అతి పెద్ద డిజాస్టర్ అవ్వడంతో ఈయనకున్న మార్కెట్ మొత్తం పడిపోయింది అంటూ చాలామంది భావించారు. కానీ సికిందర్ మూవీ లో తన తప్పేమీ లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ శివ కార్తికేయన్ తో మదరాశి అనే మూవీ తెరకెక్కించారు. 

అయితే ఈ సినిమాలో హీరోగా ముందు బాలీవుడ్ నటుడిని అనుకున్నారట.కానీ ఆ హీరో నుండి సరైన స్పందన లేకపోవడంతో శివ కార్తికేయన్ తో చేసారట.అయితే మదరాశి మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్.అయితే ఈ సినిమాని ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే అనుకున్నారట డైరెక్టర్ మురగదాస్. దాంతో ఈ సినిమా స్టోరీని షారుక్ ఖాన్ కి వివరించారట.ఇక స్టోరీ షారుక్ ఖాన్ కి నచ్చడంతో సినిమా చేద్దాం బాగుంది అని అన్నారట.ఆ తర్వాత డైరెక్టర్ మురుగదాస్ పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని షారుక్ ఖాన్ కి మెసేజ్ చేయగా ఆయన నుండి సరైన విధంగా స్పందన రాకపోవడంతో మురగదాస్ కాస్త అసహనంగా ఫీల్ అయ్యారట.

 అయితే ఆ తర్వాత చాలా రోజులకు కూడా ఆయన నుండి సరైన స్పందన గాని సినిమా చేద్దాం అని గాని మెసేజ్,కాల్ రాకపోవడంతో చివరికి షారుక్ ఖాన్ ని పక్కన పెట్టి శివ కార్తికేయన్ తో చేసారట.అలా షారుక్ చేయాల్సిన మదరాశి మూవీ చివరికి శివ కార్తికేయన్ తో చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతుండడంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో ఈ విషయాన్ని బయట పెట్టారు ఏఆర్ మురుగదాస్. ఇక శివ కార్తికేయన్ అమరన్ మూవీ తో రీసెంట్ గా తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ఏర్పర్చుకున్నారు. ఇక మదరాశి మూవీ హిట్ అయితే గనుక ఆయనకు తెలుగు, తమిళ భాషల్లో తిరుగే ఉండదు అనుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: