అనుష్క లీడ్ లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ `అరుంధతి` ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో జేజమ్మగా అనుష్క అభినయానికి ప్రేక్షకుల తో పాటు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. అరుంధతి సినిమాతోనే అనుష్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ చిత్రంలో చిన్నప్పటి అనుష్కగా నటించిన చిన్నారి గుర్తుందా? ఆమె పేరు దివ్య నగేష్. అరుంధతి సినిమాకుగాను దివ్య బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా గెలుచుకుంది.


ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం డాన్సర్ గా, మోడల్ గా రాణిస్తోంది. అయితే తాజాగా దివ్య నగేష్ పెళ్లిపీట‌లెక్కింది. అబ్బాయి కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. సహనటుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్ తో దాదాపు ఐదేళ్ల నుంచి ప్రేమ‌లో ఉన్న దివ్య‌.. ఇప్పుడు పెద్ద‌ల అంగీకారంతో అత‌నితోనే మూడు ముళ్లు వేయించుకుంది. జనవరిలో నిశ్చితార్థం జ‌ర‌గ‌గా.. సోమ‌వారం అజ‌య్ కుమార్‌, దివ్య గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.


పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను దివ్య ఇంకా సోష‌ల్ మీడియాలో పంచుకోలేదు. కానీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫొటోలు,  బ్యాచిలర్ పార్టీ పిక్స్ షేర్ చేసింది. ఇక సింగిల్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేసి మ్యారేజ్ లైఫ్‌ను స్టార్ట్ చేసిన అజ‌య్‌, దివ్య దంప‌తుల‌కు ఫ్యాన్స్ మ‌రియు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: