టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం క్రితమే విశ్వంభర అనే సినిమాను మొదలుbపెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పెండింగ్ ఉన్నాయి అని , దానితో ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల చేయలేము అని చెప్పుకొచ్చింది.

దాని తర్వాత ఈ మూవీ విడుదలకు సంబంధించి అనేక తేదీలు వైరల్ అయ్యాయి. కానీ మూవీ యూనిట్ మాత్రం ఏ తేదీని అనౌన్స్ చేయలేదు. తాజాగా ఈ మూవీ బృందం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను విడుదల చేస్తూ ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కనుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన నార్త్ ఇండియా హిందీ వర్షన్ హక్కులను ఓ ప్రముఖ సంస్థకు అమ్మి వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క నార్త్ ఇండియా హిందీ వర్షన్ థియేటర్ హక్కులను  ఏ ఏ ఏ ఆర్ట్స్ అఫీషియల్ సంస్థ వారు భారీ దరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ వారు ఈ సినిమాను నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి విశ్వంభర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం పై చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: