ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి లాంచింగ్ చేసే సమయంలో ఆ ప్రోడక్ట్ వల్ల జనాలకు ఆ సమయంలో పెద్దగా అవసరం లేనట్లయితే దానిని ఆ ప్రోడక్ట్ ఓనర్స్ చాలా తక్కువ ధరకు కస్టమర్ల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం చాలా తక్కువ ధరకు లభించడం వల్ల కస్టమర్లు కూడా దానిని భారీగా వినియోగిస్తూ ఉంటారు. అలా వినియోగించిన తర్వాత వారు దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. అలా అలవాటు పడ్డాక దాని ధరను భారీగా పెంచిన కూడా అలవాటు పడ్డారు కాబట్టి వాడక తప్పదు అనే ఉద్దేశంతో దానిని భారీ ధరతో కూడా కొనుగోలు చేసి వాడేస్తూ ఉంటారు.

ఇప్పటికే ఇలా అనేక సందర్భాలలో భారత మార్కెట్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి అనేక సేవలు మొదట ఎంట్రీ ఇచ్చినప్పుడు అత్యంత తక్కువ ధరకు ఉండడం , ఆ తర్వాత దానిని కస్టమర్లు భారీగా వినియోగించి దానికి అలవాటు పడ్డాక దాని ధరలను అమాంతం పెంచడం , పెంచాక కూడా అలవాటు పడ్డాం కదా అని వాడేయడం , అలా వాడేయడం ద్వారా ఆ కంపెనీలకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి మరొక సేవ భారత ప్రజల ముందుకు రాబోతుంది.

అసలు విషయం లోకి వెళితే  ... ప్రస్తుతం భారత్ లో చాట్ జిపిటి సేవలను వినియోగిస్తున్న జనాలు సంఖ్య చాలా తక్కువగానే ఉంది. కానీ ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ లో చాట్ జిపిటి సేవలను కేవలం 399 రూపాయలకే అమలులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సేవలను భారత ప్రజలు భారీ ఎత్తున వినియోగించే అవకాశం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి అలా అలవాటు పడ్డాక దీని సేవల ధరలను కూడా భారీ ఎత్తున పెంచుతారా ... లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: