రీసెంట్ గా నారా రోహిత్ ఎన్టీఆర్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో తాజాగా రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూలీ మూవీ చూసాను. కానీ వార్ -2 మూవీ చూడలేదు.ఆ సినిమా చూడాలి అన్న ఆసక్తి లేదు సమయం లేదు.అలాగే మా ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకుంటే రెండిట్లో కూలీ మూవీ బాగుంది కూలీ మూవీ చూడాలి అని చెప్పారు.అందుకే కూలీ మూవీ చూసేసాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

అయితే సెలబ్రిటీ హోదాలో ఉన్న నారా రోహిత్ ఒక సినిమాను తక్కువ చేసి మరొక సినిమాని ఎక్కువ చేసి మాట్లాడడం నిజంగా తప్పే..కానీ నారా రోహిత్ మాటలు ఎన్టీఆర్ మీద ఉన్న పగతోనే మాట్లాడారంటూ చాలా రూమర్లు వినిపించాయి. అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నారా రోహిత్ మీద మండిపడ్డారు కూడా..ఈ నేపథ్యంలోనే తాజాగా నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అవకాశం వస్తే నేను జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తాను. అలాగే ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి గొడవలు విభేదాలు లేవు. ఆయనతో నాకు మంచి స్నేహబంధం ఉంది అంటూ చెప్పుకోచ్చారు.

అయితే వార్ -2  మూవీ వివాదం గురించి ప్రశ్న ఎదురరవగా అసలు ఇప్పటివరకు ఆ ఆడియో నేను వినలేదు. సో దాంతో నాకు సంబంధం లేదు. దాని గురించి నేను స్పందించాలని కూడా అనుకోవడం లేదు.ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అయితే నారా రోహిత్ వార్-2 మూవీ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ వెనక్కి తగ్గారని,ఎన్టీఆర్ అభిమానులకు భయపడే నారా రోహిత్ మళ్లీ ఇలాంటి కామెంట్లు చేశారని చాలామంది నెటిజన్స్ భావిస్తున్నారు.మరి నారా రోహిత్ నిజంగానే వార్-2 మూవీ పై ఇలాంటి కామెంట్లు చేశారా.. లేక కావాలనే ఎవరైనా దీన్ని క్రియేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: