
చైతన్య రావు మాట్లాడుతూ ఘాటి సినిమాలో తన పాత్ర రెగ్యులర్ విలన్ గా ఉండదు.. ఈ చిత్రంలో చాలా విభిన్నంగా కనిపిస్తానని ఒక మెయిన్ పాత్ర గానే తనని చూస్తారంటూ తెలియజేశారు. తన కెరీర్ లోనే ఇదొక ఐకానిక్ క్యారెక్టర్ గా మారుతుందని తెలియజేశారు చైతన్య రావు. మొదట నిర్మాతలు తనని డైరెక్టర్ క్రిష్ ను కలవమన్నారని.. ఆ సమయంలోనే తనకు ఘాటి సినిమా కథను తన పాత్రను వివరించారని ఆ పాత్రలో తనని వారు ఎలా ఊహించుకున్నారో తనకు అర్థం కాలేదని.. తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలిపారు.
చాలా సీరియస్ గా వైలెంట్ పాత్ర తనదని తన నటన కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ సినిమా కోసం జలపాతం వద్ద ఒక సన్నివేశం తీసాము అది చాలా ప్రమాదకరమైన సన్నివేశము. అందులో అనుష్క గారు నటించడం మరింత అద్భుతమని ఈ సీన్ చూసినప్పుడు కచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ ఆవుతారని తెలిపారు. తాను అనుష్క గారికి కూడా పెద్ద అభిమానని ఆమెతో నటించడం ఎప్పటికీ మరిచిపోలేని విషయమని తెలిపారు. తాను కూడా అన్ని రకరకాల పాత్రలను చేయాలనుకుంటున్నానని ప్రస్తుతం అయితే క్రాంతి మాధవన్ గారితో ఒక చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు చైతన్య రావు. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన రిలీజ్ కాబోతోంది.