సినిమా ఇండస్ట్రీ లో ఏదైనా ఒక మంచి క్రేజ్ ఉన్న సినిమా ఓ వారం విడుదల అవుతుంది అంటే ఆ వారం మరో క్రేజీ సినిమా విడుదల చేయకుండా మేకర్స్ జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా రెండు మూవీలకి మంచి కలెక్షన్లు వచ్చి అవకాశం ఉండదు అనే నేపథ్యంతో మేకర్స్ మంచి క్రేజ్ ఉన్న సినిమాల విడుదల తేదీల మధ్య కాస్త గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే ఈ వారం అనగా ఆగస్టు 27 వ తేదీన మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన మాస్ జాతర సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. దానితో ఈ వారం నాలుగు చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నాలుగు చిన్న సినిమాలు ఏదైనా మూవీ కి మంచి టాక్ వచ్చినట్లయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నాలుగు సినిమాలకు మంచి కలెక్షన్లు దక్కే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఈ వారం విడుదల కానున్న ఆ నాలుగు చిన్న సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

అర్జున్ చక్రవర్తి , త్రిబాణధారి బార్బరిక్ , కన్యా కుమారి , సుందరకాండ మూవీలు ఈ వారం బాక్సా ఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం విడుదల కానున్న నాలుగు సినిమాల్లో కూడా నారా రోహిత్ హీరో గా రూపొందిన సుందరకాండ సినిమాపై ప్రేక్షకుల్లో కాస్త మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ సినిమా కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్నట్లైతే ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ వారం విడుదల కానున్న ఈ నాలుగు చిన్న సినిమాలలో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: