నందమూరి నటసింహం బాలకృష్ణ ఆఖరుగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో అఖండ 2 మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందా ..? లేక ఈ మూవీ ని చెప్పిన విధంగానే సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేస్తారా అనేది చూడాలి. బాలయ్య ఇప్పటికే తన తదుపరి మూవీని కూడా ఓకే చేసుకున్నాడు. బాలయ్య తన తదుపరి మూవీ ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను  ఎన్బికె 111 అనే వర్కింగ్ టైటిల్ తో విడుదల చేశారు.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన ఓపెనింగ్ ను అక్టోబర్ 2 వ తేదీన చేయనున్నట్లు , దసరా పండుగ తర్వాత ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య , గోపీచంద్ మలినేని కాంబోలో వీర సింహా రెడ్డి అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. దానితో వీరి కాంబోలో రూపొందనున్న రెండవ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk