తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకం టూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకు న్న వారిలో నారా రోహిత్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో చాలా సినిమాల్లో నటించాడు . ఈయన ఎక్కువ శాతం రొటీన్ కమర్షియల్ సినిమాలలో నటించకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. దానితో ఈయనకు పెద్దగా విజయాలు లేకపోయినా నటుడిగా మంచి గుర్తింపు మాత్రం ఉంది. ఆఖరుగా నారా రోహిత్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ లతో కలిసి భైరవం అనే సినిమాలో నటించాడు. పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.

తాజాగా నారా రోహిత్ "సుందరకాండ" అనే సినిమాలో హీరో గా నటించాడు. వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ...  వృతి వాఘాని  , శ్రీదేవి విజయ్ కుమార్మూవీ లో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మ వేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను కూడా మేకర్స్ అమ్మి వేశారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక నారా రోహిత్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: