ఒకప్పుడు పెళ్లి అంటే అది ఒక సాంప్రదాయ బద్ధమైన వ్యవహారం. కానీ ఇప్పుడు పెళ్లి అనేది టైమ్‌పాస్‌లా మారిపోయింది. ఎప్పుడు ప్రేమలో పడతారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు విడాకులు తీసుకుంటారు అన్నది పెళ్లి చేసుకునే వాళ్లకే అర్థం కాని స్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనించేది వయసు వ్యత్యాసం. సాధారణంగా పెళ్లి అంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలి, అమ్మాయి వయసు తక్కువగా ఉండాలి అని అంటారు. అప్పుడు వాళ్లిద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఏర్పడుతుంది, బాండింగ్ బలపడుతుంది అని నమ్ముతారు. కానీ ఈ మధ్యకాలంలో వయసు అన్నది పెద్ద విషయమే కాదు. నచ్చితే ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అన్న దానికే పరిమితం అయిపోయింది.


పది, పన్నెండు, పద్నాలుగు ఏళ్ల వయసు తేడాతో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. రీసెంట్‌గా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తనకంటే వయసులో పెద్దదైన సానియా చందర్ ను పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇప్పుడు మరో సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా . ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ తెలిసిన వారికి మాత్రం ఆయన గురించి బాగా తెలుసు. షా భార్య రత్నా పాఠక్ అని అందరికీ తెలిసిందే. కానీ ఆయనకు అంతకుముందే ఒక పెళ్లి జరిగింది. ఆయన మొదటి భార్య పేరు పర్వీన్ మురాద్.



నటుడిగా నిలబడకముందే ఆయన పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. మొదటి భార్యకు భరణం చెల్లించడానికి ఆయన దాదాపు 12 ఏళ్లకు పైగా కష్టపడ్డారు. నసీరుద్దీన్ షా, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడు పర్వీన్‌ను మొదటిసారి కలిశారు. అప్పటికి ఆయన వయసు 19 ఏళ్లు కూడా నిండలేదు. కానీ 34 ఏళ్ల పర్వీన్ అప్పటికే భర్త నుంచి విడాకులు తీసుకుని, తన పిల్లలతో జీవిస్తోంది. అయినా సరే, ఆమె విద్యార్థి అయిన నసీరుద్దీన్‌ను ఇష్టపడింది. 1969లో సాంప్రదాయబద్ధంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒక సంవత్సరం లోపే వీరికి ఒక కూతురు పుట్టింది. కానీ ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. పర్వీన్‌తో షా పెళ్లి కావడం ఆయన కుటుంబానికి అసలు నచ్చలేదు. వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉందని, విడాకులు తీసుకున్న పిల్లలున్న మహిళతో ఎందుకు పెళ్లి చేశావని ఆయనను విమర్శించారు. ఫలితంగా కలతలు పెరిగి, చివరికి వీరు విడిపోయారు. విడాకుల సమయంలో పర్వీన్ కుటుంబం భారీగా భరణం డిమాండ్ చేయడంతో షా షాక్ అయ్యారు. అయినా నటన కొనసాగిస్తూ భార్యకు భరణం చెల్లించారు. దాదాపు 12 ఏళ్ల పాటు దీనివల్ల కష్టపడ్డారు. ఈ వార్త ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!


మరింత సమాచారం తెలుసుకోండి: