అదేదో సామెత చెప్పినట్టు.."అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినా తిననివ్వదు…" ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఈ సామెతకి ఈ స్టార్ బాగా సూట్ అవుతాడని సోషల్ మీడియాలో రకంగా రకాలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు. మరి ముఖ్యంగా, ఈ మధ్యకాలంలో ఈ స్టార్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఒకప్పుడు మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేవారు. ఎంత స్థాయిలో అంటే.. ఈ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను పోస్ట్‌పోన్ చేసేవారు. ముఖ్యంగా మహిళల్లో ఈ హీరో క్రేజ్ అతి ఎక్కువగా ఉండేది.
 

ఇతగాడి సినిమాలు సినిమా రిలీజ్ అవుతుందంటే, కాలేజీకి బంక్ కొట్టి అమ్మాయిలు చెప్పకుండా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేసేవారు. అంతే కాదు, అతగాడి ఫోటోలు పేపర్‌లో వస్తే, వాటిని కట్ చేసి బుక్స్‌లో దాచుకుని, "ఐ లవ్ యూ " అని కూడా రాసుకునే వాళ్ళు ఉండేవారు. అప్పటి పరిస్థితి ఇదే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే, కేవలం ఫ్యాన్స్ తప్ప, మిగతా జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కారణం, ఈ రోజుల్లో రొటీన్ కధలని చూస్ చేసుకోవడం..అలాగే  ఫ్లాప్స్‌ను తమ ఖాతాలో వేసుకోవడం. కొంతమంది మేకర్స్ కూడా ఈయనతో సినిమాను తెరకెక్కించడానికి ఇష్టపడడం లేదు.



 ఈ మధ్యకాలంలో భారీ ఫ్లాప్ అందుకున్న ఈ హీరో, తాజాగా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు అని వార్తలు వినిపించాయి. కానీ ఫైనాన్షియల్ ఇబ్బందులు కారణంగా ఆ సినిమా హోల్డ్ లో పడింది. ఇప్పుడు అతను మరో సినిమాలో నటించే ఛాన్స్ పొందాడు. ఈ సినిమాకు ఇచ్చిన కాల్ షీట్స్, ఆ సినిమా కోసం వాడుకుంటాము అంటే, ముందు కమిట్ అయిన డైరెక్టర్ ఒప్పుకోవట్లేదట. "పోనీ, మీ సినిమాను సెట్స్ పైకి తీసుకోరా" అని అంటుంటే, ఫైనాన్షియల్ గా డబ్బులు లేవు, ఇబ్బంది అంటూ చేతులు ఎత్తేసారట. ఇప్పుడు ఈ హీరో పరిస్థితి దారుణంగా ఉంది. హిట్ కొట్టకపోతే ఇండస్ట్రీలో ఆఫర్లు రావు. వచ్చిన ఆఫర్ వదులుకుంటే, అసలే మోసం అవుతుంది. కమిట్ అయిన ప్రాజెక్ట్ కొనసాగించలేక.. కొత్త ప్రాజెక్ట్‌కు కమిట్ అవ్వలేక అల్లాడిపోతున్నాడు ఈ హీరో. ఈ హీరో గురించే  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువుగా వార్తలు వినిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: