ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన టెలివిజన్ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఇండియాలో మొదట బిగ్బాస్ టెలివిజన్ కార్యక్రమం హిందీ భాషలో ప్రారంభం అయింది. హిందీలో ఈ షో అద్భుతమైన సక్సెస్ కావడంతో ఈ షో ను ఇండియా వ్యాప్తంగా అనేక ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితమే ఈ షోను తెలుగులో కూడా మొదలు పెట్టారు. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ కి సంబంధించిన బుల్లితెర సీజన్లు 8 విజయవంతంగా కంప్లీట్ కాగా , ఒక ఓటిటి సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ తెలుగు బుల్లి తెర తొమ్మిదవ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ కు సంబంధించిన అనేక ప్రోమోలను బిగ్ బాస్ బృందం వారు విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.

బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్కు టాలీవుడ్ కింగ్  అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్లో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది వీరే అంటూ అనేక మంది పేర్లు తెర పైకి వస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కాంటెస్టెంట్ల లిస్టులో ఓ సీరియల్ నటి పేరు బాగా వైరల్ అవుతుంది. ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు తనుజ గౌడ. ఈ ముద్దుగుమ్మ ముద్ద మందారం అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఈమె ముద్ద మందారం సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దానితో ఈమెకు ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానులు ఏర్పడ్డారు. బుల్లి తెరపై ఇప్పటికే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లయితే ఈమె కొంచెం మంచి ఆట తీరును కనబరిచిన చాలా వారాలు హౌస్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి తనుజ గౌడ బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: